Saturday, November 14, 2015

telugu translations from hindi

ఆలైన్/ విష్ణు ఖరే
మేము యెంతో ప్రేమతో స్నానించి
నిన్ను
శుభ్రమైన బట్టలు తొడిగాం
వొత్తైన నీ నల్లని జుట్టును దువ్వి
నీ పసి పాదాలను చుంభించాం
నీ బూటు దారాన్ని బిగుతుగా లాగి...
ఆట పట్టించే నెపంతో గాలీబు నీ
బుగ్గలపై ముద్దు పెట్టినప్పుడు
యెప్పటిలాగే తుడుచుకునే వాడివి
ఆ తడిని.... నీవు
యిప్పుడేమో యీ తడి యిసుకలో నిదురోతున్నావు యిక్కడ...
దూరం లేని మరో తీరం వైపు చూస్తో
నీ కళ్లు మూతపడ్డాయేమో
నీ కోసం వేచి చూస్తున్న నీ కొత్త స్నేహితులను వూహించుకుంటుండగా
నీకు నిదుర పట్టేసిందేమో....
మనం వచ్చే నావలో యెంతో సంతోషంగా ......నువ్వూ గాలీబు
నావను నడుపుతున్న నాన్నను చూస్తూ .....
భయపడుతున్న అమ్మను చూస్తూ ...
నవ్వుకుంటూ మీరు ముగ్గురు....
నావ సముద్రం నన్ను భయపెడ్తాయని
తెలుసు నీకూ ....అలలను బుజ్జగించావు
 సుతారంగా చేయి చరచి
యిప్పుడేమో నిద్దరోతున్నావు యిక్కడికి వచ్చి యీ తడి యిసుకపై...
నిన్ను యిలా చూసిన కన్నీళ్లాగునా...
యెవ్వరికైనా యింత ముచ్చటైన పిల్లోడు ....
నేలపైన నుదురు ఆన్చి యెవరి కోసమో ప్రార్థన లో లీనమయ్యాడు అని...
మెల్ల మెల్లగా లాలి పాడుతూ
నిను జో కొడుతున్న. అలలల్నే చూస్తూ వుండగా...
నీ కన్నులు మూత పడ్డాయేమో.....
నీవు యింకను నవ్వుతూ వున్నట్లే కన్పిస్తున్నావు
నిను వెతుక్కుంటూ వచ్చాం మేమిద్దరమూ....
నీ తల వైపున కూర్చుంటాం కొంత సేపు ...
నిద్దరోతున్న నీవు యెంత ముద్దొస్తున్నావో.. ..
నిను మేల్కొల్పాని మనస్కరించట్లేదు...
నీవు కల కంటున్నావేమో...నవ తీరాలను నయా మిత్రులను...
.నీ మేనత్తను తిమింగలమును...నువ్వేమో
యీ యిసుక తడిలో బోర్ల తిరిగి నిదురోతున్నావు..
యింత దూరం నీవు యేం గుర్తొచ్చిందని వచ్చవూ ..
నీ కోసం మేమూ రావాల్సొచ్చింది..
.పద యిప్పుడే యీ యిసుక తడిని యీ అలల లాలి పాటల్ని వదలి...
యీ అలలు సాయంత్రమయ్యాక తమ కౌగిట్లోకి లాక్కుంటాయి...
యేడిస్తే యేడవనీ మీ నాన్నాను అత్తనూ యెక్కడో దూరంగా .
.మనం ముగ్గురం కలిసే వున్నాం కదా..
వదలై కొత్తని అపరిచితంని కలకనడం
అలాగే చూడని తీరాన్ని మిత్రుల్ని
చూడు నా యెడమ చేతిని పట్టుకొని గాలీబు.
.మరో చేయి నీ కోసం వేచి చూస్తోంది..
వులికిపడి ఆశ్చర్యంతో ఆనందంతో మమ్మల్ని గుర్తించు..
నిను మా గుండెలకు హత్తుకోనివ్వు...
రా నీ బూటులో నుంచి యిసుకను తీసేస్తాను...
యిష్టమైతే వొ సారి తిరిగి చూసుకో.....
యీ తీరాలను దూరమైపోతున్న దిగంతాలను
పద మన కోసం యెదురు చూస్తోంది
విధ్వంసం తరువాతి వో బూడిద వొడి
(టర్కీ తీరంలో కనిపించిన అలైన్ పిల్లవాడి శవం ప్రపంచానంతటిని కన్నీరు పెట్టించింది...)


నేను నిన్ను మళ్ళీ కలుస్తాను.../అమృతాప్రీతం
(31.08.1919 - 31.10.2005)
నేను నిన్ను మళ్ళీ కలుస్తాను
యెక్కడా ..యెలా..
తెలియదు నాకు
ఒహుశ నీ వుహల్లో నిప్పుకణమై
నీ కాన్వాసుపై వాలుతాను
లేదా నీ కాన్వాసు పై
వో రహస్య రేఖలా మారి
నిశబ్దంగా చూస్తో వుంటాను.
సూర్యకిరణమై నీ రంగుల్లో కరుగుతాను
లేదా రంగుల బాహువుల్లో కూర్చొని
నీ కాన్వాసుకు...
తెలియదు నాకు
యెలా...యెక్కడ ...
అయితే నిన్ను తప్పనిసరిగా కలుస్తాను
వొక కళ్ళజోడుగా మారి వుండొచ్చును
యింకా యెగిరి దూకే సెలయేటి నీరై...
నేను నీటి చుక్కనై...నీ శరీరాన్ని మర్ధించి...
వొక చల్లదనమై నీ గండెల్ని చుట్టు కుంటాను...
నాకిక యేం తెలియదు
కాలంతో పాటు యీ నా ప్రాణం
పయనిస్తున్నదని మాత్రమే తెలుసు
యీ శరీరం
యెదో వో రోజు గతించక తప్పదు
అయితే సృష్టికణాలచే నిర్మింపబడ్డ
యీ చైతన్యపు దారాల్ని
చుట్టుకొని ....కణాల్ని యేరుకొని
నిన్ను నేను మళ్ళీ కలుస్తాను
(సౌజన్యం: నయా జ్ఞానోదయ్...యిది అమృతా ప్రీతం గారి చివరి కవిత.)

కవిత్వం / నరేంద్ర జైన్.
నాకు కవిత్వం
యినుపవూచలకు ఆవల కనిపించే
వో విశాలమైన ఆకాశం
అది
యెండలో...గాలిలో..
దుమ్ములో...ధూళిలో...
కొమ్మల్లో...గింజల్లో
కవిత్వం
కలల్లోను...పీడకలల్లోను...
స్మృతుల్లోనూ...విస్మృతుల్లోనూ....
అది
యెక్కడో దూరంగా విన్పించే వో స్వరం
నిరంతరం తలుపు తట్టి వెళ్ళిపోతుంటుంది....
కవిత్వం
వొక ఆత్మఘోష
వొక వొప్పంద పత్రం
బూడిదలో దాగిన అగ్నికణం
మంట నుంచి వేరవుతున్న నిప్పురవ్వ
చిరునామా లేని వుత్తరం...
అదొక
సంభాషణ
యెక్కడో ...
మౌనంలోని మార్మిక క్షణం
మూసిన గది అరుపు
గాయంపై లేపనం...
కవిత్వం
నీళ్ళతో నిండిన పాత్ర
పాత్రలో రాలే మధువు
కారణం యేంటో తెలుసా..
స్పందించే శ్వాస
స్పందనే కవిత్వం
నిత్యం రొప్పుతూ ...ఆలోచిస్తూ...
మనిషిలా కవి వెళ్ళిపోతూ...
పౌరజీవితాన్ని స్వీకరించి...
కానీ కవిత్వం
డేగవేటలా..
జీవిస్తూ...
ప్రస్తానిస్తూనే వుంటుంది....
(చాలా సంవత్సరాల క్రితం చదవి ముగ్ధుడినై, కవితో మాట్లాడీ...దాచుకున్న కవిత...)